కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల వాడకం వల్ల కంటిపై ఒత్తిడి పెరుగుతోంది. కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి ఈ ఆహారం తీసుకోవాలి. క్యారెట్లు: ఇందులోని ‘విటమిన్ ఏ’ కంటి చూపుకు చాలా అవసరం. ఆకుకూరలు: వీటిలోని లూటిన్, కళ్లను సూర్యరశ్మి నుంచి వచ్చే హానికర కిరణాల నుంచి రక్షిస్తుంది. నట్స్: బాదం, వాల్నట్స్ వంటి గింజల్లో ఉండే విటమిన్-E కంటి కణాలు దెబ్బతినకుండా చూస్తుంది.