తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ముత్తారం మండలం పోతారం ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న కుల్ల రాజేందరన్ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మునగాల మహిపాల్ రెడ్డి, పొలంపల్లి ఆదర్శన్ రెడ్డి ప్రకటించారు. కుల్ల రాజేందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.