TPT: తొట్టంబేడు పరిధిలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. వరదయ్య పాలెం వైపు బైకుపై చందు (21) వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఏరియా హాస్పిటల్కు తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.