BHNG: రామన్నపేట మండలం బోగారం గ్రామంలో, ఎన్నికల హామీ మేరకు గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్టేజి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ‘మన ఊరు మనబడి’ స్పూర్తితో పాఠశాల అభివృద్ధికి సహకరిస్తానని, భవిష్యత్తులో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు.