»Vijay Saireddy If You Want A Share In Ttd You Should Also Give A Share In Hyderabad
Vijay SaiReddy: టీటీడీలో వాటా కోరితే హైదరాబాద్‌లో కూడా వాటా ఇవ్వాలి
పీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయాల గురించి చర్చించుకున్నారో ప్రజలకు చెప్పాలని వైసీపీ నేత విజయసాయిరెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరినట్టయితే హైదరాబాద్ ఆదాయంలో ఏపీకి వాటా ఇవ్వాలని అడగడంలో నిజమెంతో తెలియాలని తెలిపారు.
Vijay SaiReddy: If you want a share in TTD, you should also give a share in Hyderabad
Vijay SaiReddy: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయాల గురించి చర్చించుకున్నారో ప్రజలకు చెప్పాలని వైసీపీ నేత విజయసాయిరెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరినట్టయితే హైదరాబాద్ ఆదాయంలో ఏపీకి వాటా ఇవ్వాలని అడగడంలో నిజమెంతో తెలియాలని తెలిపారు. ఈ విషయంలో కూటమిలో ఉన్న మూడు పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రూపంలో ఏపీకి పాపం తగిలిందని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనని, ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఏపీకి వచ్చారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అన్నీ ఆరంభ శూరత్వాలేనని, ప్రచారం తప్ప సాధించిన ఫలితాలు లేవని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక ఆర్కిటెక్ట్ మాదిరిగా చంద్రబాబును రేవంత్‌రెడ్డి పిలిచినట్టుందని కాకాణి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రుల సమావేశానికి దశ, దిశ లేదని, పరస్పర డబ్బా తప్ప సాధించిందేమీ లేదని విమర్శించారు. తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పోలవరం గురించి ఎప్పుడు ఆలోచించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపు మండలాల్లోని గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుందని తెలిపారు. టీటీడీలో కూడా తెలంగాణ వాటా అడిగినట్టు సమాచారం వచ్చిందని, దీన్ని మంత్రులు ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించారు.