చిత్ర పరిశ్రమ లోని సుప్రసిద్ధులను తమ రాజకీయాలలో పావులుగా వాడుకుని, వారి పరువు ప్రతిష్టలను దారుణంగా దెబ్బతీసే విధంగా రాజకీయనాయకులు వ్యవహరించడం ఇటీవల తరుచుగా చూస్తున్నాం. కెటిఆర్ మీద కోసం, అక్కసుతో అక్కినేని కుటుంబాన్ని కొండా సురేఖ రచ్చకెక్కించారు. కెటిఆర్‌ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబ సభ్యుల మీద దుమ్మెత్తిపోసి, కుటుంబగౌరవాలను అతి సునాయాసంగా మంటగలిపారు.
సినిమా పరిశ్రమలోని ప్రముఖల సేవలను అత్యవసర సమయాలలో ఉపయోగించుకోవడం అన్నది ఏ దేశంలో ఏ ప్రభుత్వానికైనా సర్వసహజమైనా విషయం. లేదా పరిశ్రమ ప్రముఖులే ప్రజలు ఆపదల పాలైనప్పుడు స్వఛ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి అండగా ఉండి బాధ్యతలను నెరవేర్చిన సందర్భాలు కూడా చరిత్రలో కోకొల్లలు. కానీ ఇటీవల సీన్ రివర్స్ అయింది.
చిత్ర పరిశ్రమ లోని సుప్రసిద్ధులను తమ రాజకీయాలలో పావులుగా వాడుకుని, వారి పరువు ప్రతిష్టలను దారుణంగా దెబ్బతీసే విధంగా రాజకీయనాయకులు వ్యవహరించడం ఇటీవల తరుచుగా చూస్తున్నాం. కెటిఆర్ మీద కోసం, అక్కసుతో అక్కినేని కుటుంబాన్ని కొండా సురేఖ రచ్చకెక్కించారు. కెటిఆర్‌ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబ సభ్యుల మీద దుమ్మెత్తిపోసి, కుటుంబగౌరవాలను అతి సునాయాసంగా మంటగలిపారు. వాళ్ళకే రకంగానూ సంబంధం లేని వ్యవహారంలో వాళ్ళని ఇరికించి తన టార్గెట్‌ని సేల్చడానికి చేసిన ప్రయత్నం సర్వత్రా కొండా సురేఖను బద్నాం చేసిందనేది నిజం.
కెటిఆర్‌కి కరెక్టు డోస్
అలాగే ఇటీవల జరగిన పుష్పా సినిమా ఫంక్షన్లో ఏ కారణం చేత మర్చిపోయాడో, లేదా తడబాటుకు లోనయ్యాడో ఆ క్షణంలో ఎవ్వరూ ఇప్పుడు విప్పిచెప్పలేరు గానీ, అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు హఠాత్తుగా పలుకలేకపోయారు. దాన్ని అడ్డుపెట్టుకుని కెటిఆర్ రేవంత్ రెడ్డిని అవమానపరిచే విధంగా మాట్లాడారు. నీ పేరే వాళ్ళకి గుర్తు లేదు నువ్వేం ముఖ్యమంత్రివి అనే విధంగా మాట్లాడడం రాజకీయం దుమారం లేపింది. క్రమంలో అల్లు అర్జున్ మీద కేసు బుక్ కావడం, అరెస్ట్ కావడం, కోర్టులో ట్రల్ ఫేస్ చేయడం అన్నవి జరుగుతూ వచ్చాయి. ఇంకొందరు రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోవడం కారణంగానే అల్లు అర్జున్ ఇంత విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడని వ్యాఖ్యానించడం పనిగా పెట్టుకుని మొదలెట్టారు. దానాదీనా రాజకీయాల సుడిగుండంలోకి సినిమా ప్రముఖులను సునాయాసంగా లాగేస్తున్నారు రాజకీయవాదులు.
దీని గురించి చిత్రపరిశ్రమ నుంచి ఎవ్వరూ కూడా ఇదమిద్దంగా మాట్లాడలేకపోయారు ఇప్పటి వరకూ. అంత దమ్ము, ఖలేజా ఎవ్వరికీ లేకపోయింది. ఏ మాట్లాడితే ఏం ముంచుకొస్తుందోనన్నట్టుగా నోరు మూసుకుని కూర్చున్నారు. కానీ దిల్ రాజు గట్స్ ఉన్న నిర్మాత. ప్రస్తుత తెలంగాణ ఎఫ్డిసి ఛైర్మన్. ఖలేజా ఉన్న తెలంగాణ బిడ్డ. ఇప్పడు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయఢంకా మోగించగలిగిన అపారమైన పాప్యులారిటీ ఉన్న గాఢమైన మనిషి. అందుకే ఆయన మాత్రమే నోరు విప్పగలిగారు. విప్పారు. కెటిఆర్‌కి గట్టిగా డోస్ ఇచ్చారు. ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని కరెక్టు సమయంలో పేల్చారు దిల్ రాజు.
సినిమావాళ్ళని రాజకీయాలలోకి లాగవద్దు, వాళ్ళకి రాజకీయాలు ఆపాదించవద్దు, ఒకరి మీద ఒకరు చేసుకునే దాడి ప్రతిదాడులకు సినిమావాళ్ళని బలి చేయకండని బాహాటంగా, బిగ్గరగానే దాదాపు వార్నింగ్ రేంజ్ వ్యాఖ్యానించారు. దమ్మున్నోడు చేసే పని ఇది. ముఖ్మమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం నాలుగు గోడల మధ్య జరిగిన రహస్య సమావేశం కాదని, ప్రభుత్వం పరివ్రమ ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటుందని, హైదరాబాద్‌ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మలిచే దిశగా పరిశ్రమ, ప్రభుత్వత ఏకత్రాటి మీద నిలబడి కృష్ చేస్తుందని పూర్తిగా తేటతెల్లం చేసింది.
దిల్‌రాజు ఇలా మాట్లాడడం వల్ల పరిశ్రమ స్టాండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఏ విధంగా ఉన్నదీ అనేది ప్రపంచానికి పూర్తిగా అర్ధమయింది. ఏ రకంగా చూసుకున్నా కూడా దిల్‌రాజు లాటి ఒక బలమైన వ్యక్తి చిత్ర పరివ్రమకి ఎంత అవసరమో ఇటువంటి సందర్భాలు ఎదురైతే గానీ ఎవ్వరికీ తెలియదు. హేట్సాఫ్ దిల్‌రాజుగారు