»Ram Charan Follows His Father Chiranjeevi Footsteps
అదీ రామ్ చరణ్ సంస్కారం
చిరంజీవి కడుపున పుట్టి, ఆయన గుణగణాలను, ప్రతిభాపాటవాలను తొలిచిత్రం నుంచే సూచనప్రాయంగా కనబరుస్తూ వచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్టారీ పీక్ స్టేజ్ చేరుకుంది. అంత గొప్పఫాదర్కి కొడుకుగా పుట్టిన తర్వాత తండ్రి డిగ్నిటీని నిలబెట్టడమే రామ్ చరణ్ తొలి ఘన విజయం.
తండ్రి లక్షణాలను అక్షరాల పుణికిపుచ్చుకున్న కొడుకులు అక్కడక్కడ ఉంటారు. తండ్రి స్థాయిని ఇనుమడింపజేస్తూ దూసుకువెళ్ళడం కూడా అందరి కొడుకులకు కొరుకుడు పడేదికాదు. తండ్రి సాధించిన ఘనతని, కీర్తిని పాడుచేయకుండా ఉంటే చాలనే వేదాంతం వల్లె వేసే సందర్భాలే ఎక్కువగా కనిపిస్తాయి. వినిపిస్తాయి. సరే సుపుత్రా కొంపపీకరా అనేరకం కొడుకుల్ని కూడా ఇటీవల మనం చూడడం దినచర్యగా కూడా మారిపోయింది. కానీ ఇప్పుడు రాస్తున్నది తండ్రి పోగు చేసిన ఘనచరిత్రను ముందుకు తీసుకెళ్తున్న కొడుకు గురించి, అదే రామ్ చరణ్ గురించి.
మెగాస్టార్ చిరంజీవి కడుపున పుట్టి, ఆయన గుణగణాలను, ప్రతిభాపాటవాలను తొలిచిత్రం నుంచే సూచనప్రాయంగా కనబరుస్తూ వచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్టారీ పీక్ స్టేజ్ చేరుకుంది. అంత గొప్పఫాదర్కి కొడుకుగా పుట్టిన తర్వాత తండ్రి డిగ్నిటీని నిలబెట్టడమే రామ్ చరణ్ తొలి ఘన విజయం. సినిమాల పరంగా ఆయన సాధించిన ఏ రికార్డయినా కూడా అంతకన్నా తక్కువే అవుతుంది. మెగాస్టార్ విశ్వవ్యాప్త అభిమానులు, సాంఘికంగా మెగాస్టార్ ఔన్నత్యం ఇవన్నీ కూడా రామ్ చరణ్ ముందు ఛాలెంజ్‌లే. కానీ వాటన్నిటినీ కూడా చాలా ఓర్పుతో, నేర్పుతో, క్రమశిక్షణతో నిలబెట్టుకున్నందుకే రామ్ ఛరణ్ మొట్టమొదట గ్రేట్. తర్వాత ఇంక హిట్స్, సూపర్ హిట్స్, గ్లోబర్ స్టార్ బిరుదలు అన్నీ అలవోకగా ఆయన వద్దకు చేరాయి.
సచిన్ ఎలా అవుతాడు శంకర్?
నిజానికి త్రిబుల్ ఆర్ లాటి సంచలన విజయం అందుకున్న తర్వాత హిట్ చిత్రాలకి దూరంగా జరిగిపోయిన శంకర్‌తో టీమ్ అప్ కావడానికి రామ్ చరణ్ మొగ్గు చూపడం, ఆసక్తి కనబరచడం చాలా గొప్పవిషయమనే చెప్పాలి., హిట్స్ అండ్ సక్సెస్ వెనుకనే పరిశ్రమ, పరిశ్రమలోని వారు పరిగెడతారు. హిట్లు లేవనగానే మనకెందుకులే అనుకుంటారు. కానీ రామ్ చరణ్ అలా అనుకోలేదు. శంకర్‌లోని ప్రతిభను మాత్రమే గుర్తు పెట్టుకున్నారు. హిట్స్ అండ్ ఫ్లాప్స్ కామన్. కానీ మెరిట్ అండ్ టాలెంట్ శాశ్వతమనే ఆలోచన ఉండాలంటే అందుకు ఎంతైనా మెచ్యూరిటీ కావాలి. ఆ మెచ్యూరిటీ మెండుగా, నిండుగా ఉన్న హీరోయే రామ్ చరణ్. సినిమా చేయడమే కాదు, శంకర్‌ని డల్లాస్‌లో జరిగిన ఈవెంట్లో ఆకాశానికి ఎత్తిమరీ మాట్లాడారు. క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఒక్కడే, సినిమాప్రపంచంలో శంకర్ ఒక్కడే అని రామ్ చరణ్ మాట్లాడడమన్నది అది ఆయన గట్స్. అదెంత పెద్ద మాట. కానీ ఇందులో ఓ నిజం కూడా ఉంది. సచిన్ టెండూల్కర్ కూడా చివరలో వంద సెంచరీలు పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డాడు. అందరూ సచిన్‌ని టీమ్లోనుంచి తీసేయమన్నారు. మీడియా మొత్తం సచిన్ గురించి దారుణంగా రాసింది. కానీ సునీల్ గవాస్కర్ ప్రోత్సాహంతో అందరూ నోరు మూసుకున్నారు. అదే సచిన్ వంద సెంచరీలు పూర్తి చేసి ప్రపంచరికార్డు నెలకొల్పిన ఓకేఒక్క భారతీయుడుగా భారతరత్నగా ఎదిగాడు. ఒక చరిత్రగా మిగిలాడు.
ఇప్పుడదే పరిస్థితి దర్శకుడు శంకర్‌ది. కానీ రామ్‌చరణ్ ప్రోత్సాహం శంకర్‌ని మరో టెండూల్కర్ చేయబోతోందని ట్రేడ్ టాక్.
జగదేకవీరుడు తర్వాత మళ్ళీ గేమ్ ఛేంజరే
ఇదే గతంలో కూడా దర్శకుడు రాఘవేంద్రావు విషయంలో జరిగింది. జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం ముందు రాఘవేంద్రరావు ఫ్లాపుల మీద ఫ్లాపులు తీయడం మొదలెట్టారు. వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ మాత్రం ఆయన్నే దర్శకుడిగా ఎంచుకున్నారు. అశ్వనీదత్ మీద పరిశ్రమ మొత్తం విరుచుకుపడింది. నీకేం బుద్ధి లేదా అని చీవాట్లు పెట్టింది. కానీ అశ్వనీదత్ మాత్రం వెన్ను చూపలేదు. వెనుదిరగలేదు. దానికి చేయూతనిచ్చింది మాత్రం మెగాస్టార్ చిరంజీవే. ప్రతిభ ప్రధానం, హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఎవ్వరికైనా కామన్. అని రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేయడానికి మెగాస్టార్ అంగీకారం తెలపడమే కాకుండా, రాఘవేంద్రరావుకి ఎంతో నైతికంగా ధైర్యాన్నిచ్చారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సరికొత్త చరిత్రను సృష్టించింది. మెగాస్టార్ కెరీర్లోనే చెప్పుకోదగ్గ గొప్ప కళాఖండం అది. అలాగే గేమ్ ఛేంజర్ ప్రారంభానికి ముందు కూడా రామ్ చరణ్‌కి కూడా శంకర్‌తో నీకెందుకు అనని వాళ్ళు ఉండే ఉంటారు. దిల్రాజును తిట్టినవాళ్ళు కూడా ఉండరంటే అతిశయోక్తే అవుతుంది. కానీ అప్పుడు అశ్వనీదత్, మెగాస్టార్. ఇప్పుడు దిల్‌రాజు అండ్ రామ్ చరణ్. కాలం గడిచింది. కానీ అదే సందర్భం మళ్ళీ.