సీనియర్లు చెప్పిన మాటలు ఊరికే పోవు. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అనేది తరతరాల నానుడిగా కొనసాగుతూ వస్తోంది. సినిమాల విషయంలో అదీ మరింత నిజమనిపిస్తుంది. అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తన ఇంట్లో ధియేటర్లోనే చూశారు.
ఎన్నో అనుభవాలతో కెరీర్‌ని పండించుని, విజయాలు, వైఫల్యాలను చవిచూసిన పరిణితిని సాధించుకున్న సీనియర్లు చెప్పిన మాటలు ఊరికే పోవు. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అనేది తరతరాల నానుడిగా కొనసాగుతూ వస్తోంది. సినిమాల విషయంలో అదీ మరింత నిజమనిపిస్తుంది. అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తన ఇంట్లో ధియేటర్లోనే చూశారు. దిల్ రాజు కోరిక మేరకు సినిమాని పూర్తిగా చూసి ఎనలేని సంతృప్తిని వ్యక్తం చేశారు మెగాస్టార్.
దిల్‌రాజు మాటల్లోనే చెప్పాలంటే, మెగాస్టార్ గేమ్ ఛేంజర్ సినిమా చూసేందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసి, దిల్‌రాజు రామ్ చరణ్ టాలెస్ట్ కటౌట్ ఓపెనింగ్ విజయవాడ వెళ్ళారు. తనైతే విజయవాడకు ప్రయాణం చేస్తున్నారుగానీ, దృష్టంతా మెగాస్టార్ సినిమా చూసి ఏంచెప్తారా అనేదానిపైనే ఉంది. మెగాస్టార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు కూడా టెన్షన్‌గానే మొబైల్ ఆన్‌చేశారు. అట్నుంచి మెగాస్టార్ మాటలు విన్నాక మాత్రం గాల్లో తేలినట్టుందే అన్న పాటలాగా దిల్‌రాజు గాల్లో తేలిపోయారు. చాలా బావుంది అన్న మెగామాటలు దిల్‌రాజు గుండెల్లో కొండంత ఉత్సాహాన్ని నింపాయి.
ఏమాత్రం సంశయం లేకుండా, ఏ కరెక్షన్సూ చెప్పకుండా ఫుల్ అండ్ ఫైనల్‌గా సినిమా బావుందని మెగాస్టార్ రేంజ్ మనిషి, కాదుకాదు, అంతటి హీరో చెప్పడమంటే అది చాలా పెద్ద అవార్డు, రివార్డు ఏ నిర్మాతకైనా కూడా. పైగా దిల్‌రాజు చాలా పెద్ద గేమే అడారు ఈ సినిమా విషయంలో. ఓ పక్కన త్రిబుల్ ఆర్తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న స్థాయికి రామ్ చరణ్ వెళ్ఙిపోయాక, ఇటీవలి రోజులలో చెప్పుకోదగ్గ సక్సెస్ లేని శంకర్‌ని డైరెక్టర్‌గా పెట్టి, అంత భారీ బడ్జెట్టుతో గేమ్‌చేంజర్ సినిమా నిర్మాణానికి పూనుకోవడం కేవలం దిల్‌రాజు మాత్రమే చేయగలిగిన సాహసం. ఈ ఫీట్ మరొకడి వల్ల కానేకాదు. అది దిల్‌రాజు స్పెషల్ స్టాంప్.
మెగామాటలు నిజమవుతాయి.ఎందుకంటే గతంలో కూడా రంగస్థలం విషయంలో కూడా ఆయన జడ్జిమెంటు అక్షరాల నిజమైపోయింది. దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమా చూసిస్తే, మెగాస్టార్ సినిమా పూర్తిగా చూసినతర్వాత, లెంత్ గురంచి ఏ మాత్రం డౌట్ పడొద్దు, యాజిటీజ్‌గా విడుదల చేయండి, బావుందని దర్శకుడికి ధైర్యం చెప్పారు మెగాస్టార్. రంగస్థలం రామ్‌చరణ్‌ని గొప్ప హీరోగానే కాదు, అంతకన్నా గొప్పనటుడిగానే రికార్డుల సాక్షిగా నిరూపించింది.
ఇప్పడు మళ్ళీ అదే మెగాస్టార్. అవే మాటలు. మళ్ళృ అంతే హిట్…. కాదుకాదు.. అంతకన్నా పెద్ద హిట్‌ని నిర్మాతగా దిల్‌రాజు కొట్టబోతున్నారన్నది లేటెస్ట్ అంచనా. ఇంక రామ్‌చరణ్ ఇహేజ్ని మరింత పెంచుతూ, దర్శకుడిగా శంకర్ కెరీర్లో తను మర్చిపోయిన సక్సెస్ అనే మాటలను తిరిగి తీసుకొస్తాయి. సో బెస్టాఫ్ లక్ ఎవ్రీబడీ.