నిజానికి అందరూ అనుకునేంత పూలపాన్పు కాదు సినిమా పరిశ్రమ. దారంతా ముళ్ళు, రాళ్ళు, కనిపించని అగాధాలు, ఊహించని అవరోధాలు అడుగడుగునా పడగలెత్తుతూనే ఉంటాయి. వాటన్నిటినీ, కేవలం సినిమా పట్ల తీరని మక్కువతోనే ఇక్కడందరూ ఎత్తుపల్లాల మధ్యన మునిగితేలుతుంటారనేది పచ్చినిజం.
సినిమా పరిశ్రమ అనగానే అందరికీ విపరీతమైన అపోహ. లెక్కలేనంత దురభిప్రాయం. ఇక్కడందరూ అక్రమంగా ఆస్తులు సంపాదిస్తారు, ప్రభుత్వానికి, అధికారులకి అందకుండా అన్నీ దాచుకుంటారు అనే విస్తృతమైన అనుమానాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ నిజానికి అందరూ అనుకునేంత పూలపాన్పు కాదు సినిమా పరిశ్రమ. దారంతా ముళ్ళు, రాళ్ళు, కనిపించని అగాధాలు, ఊహించని అవరోధాలు అడుగడుగునా పడగలెత్తుతూనే ఉంటాయి. వాటన్నిటినీ, కేవలం సినిమా పట్ల తీరని మక్కువతోనే ఇక్కడందరూ ఎత్తుపల్లాల మధ్యన మునిగితేలుతుంటారనేది పచ్చినిజం.
దిల్‌రాజు లాంటి అగ్రస్ఘానాన్ని సాధించి, విజయవంతంగా కొనసాగుతున్న ఛాంపియన్స్ పరిశ్రమలో అతితక్కువే అయినా, వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే సంఖ్యే అయినా కూడా, అందులోనూ మరీమరీ దిల్‌రాజుది విశేషమైన స్థానం. ఆయన కేవలం ఉత్సాహంతో ఉరకలు వేసి, యంగ్ ఏజ్‌లోనే చిత్రపరిశ్రమలోకి దూసుకొచ్చి, అవగాహనతో, అంకితభావంతో పనిచేసే ఈ స్థాయికి చేరుకున్నారన్నది ఏ కొందరికో మాత్రమే తెలుసు. ఆయన మొదలు లెలియనివారికైతే ఆయనో పెద్ద బ్రహ్మపదార్ధం. ఇన్ని సినిమాలు ఎలా తీస్తున్నారు, ఎన్నెన్ని సినిమాలు పంపిణీ చేయగలుగుతున్నారు, అసంఖ్యాకమైన థియేటర్లను ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు, ఎంత వెనకన దాచుకుని ఉంటే ఆయన ఇంతలా చెలరేగిపోగలుగుతున్నారు అనేదే అందరి విశ్లేషణ.
ఆ నవ్వుల వెనుక దాగి ఉన్న కఠోరశ్రమ ఎవ్వరికీ కనబడదు. ఆ చలాకీ కదలికల వెనుక కనిపించని ఒత్తిడి, తలనొప్పి చెప్పినా అర్ధం కాదు. అందుకే ఆయనపైన జరిగిన ఐటి దాడులకు ఎవరికి నచ్చిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేశారు. ఎవరికి తోచిన విశ్లేషణలు కళ్ళతో ప్రత్యక్షంగా చూసినట్టుగా రెచ్చిపోయారు. గేమ్ ఛేంజర్ నిజానికి ఆయనకి దారుణమైన దెబ్బ. ఓ గొప్ప సినిమా తీద్దామన్న ధృఢసంకల్పం తప్పితే, గేమ్ ఛేంజర్‌తో కోట్టు సంపాదిద్దామన్న ఊహ ఆయనకు ఏ కోశాన లేదు. హిట్ అయితే ఆ లెక్క వేరు. కానీ అది మొడటినుంచి చివరి వరకూ మొరాయిస్తూనే ఉంది. ఆయన్ని చీకాకు పెడుతూనే ఉంది. ఒకరిద్దరు ఆ ప్రాజెక్టుని దిల్‌రాజు వదులుకుంటే మంచిదని పరోక్షంగానే కాదు, ప్రత్యక్షంగా కూడా చెప్పినవాళ్ళు లేకపోలేదు. అది ఆయనకి తెలుసు. కాకపోతే ఓ ప్రతిష్టాత్మకమైన సినిమాని నిర్మించగలిగే తాకత్, సత్తా ఉన్న అగ్రశ్రేణి నిర్మాత కాబట్టి ఆయన తట్టుకుని, చివరంటా నిలబడి, విడుదల వరకూ తీసుకురాగలిగారు. ఇంకొకరైతే శంకరగిరిమాన్యాలు పట్టేవారు. ఇందులో ఎటువంటి అనుమానమూ లేనేలేదు. బైట నుంచి చూసేవారికి గేమ్ ఛేంజర్ పెద్ద జాక్‌పాట్ లాగానో, మరీ పెద్ద బంపర్ ఆఫర్ అనో అనుకునే ప్రమాదం ఈ ప్రాజెక్టులో ఉంది. అదే గేమ్ ఛేంజర్‌లో అతిపెద్ద సవాలు. దిల్‌రాజు వాటన్నిటినీ ఊహిస్తూనే, ముందున పెద్ద సుడిగుండం ఉందని తెలిసినా, కేవలం సినిమా మోసం చేయదులే అనే మానసికమైన భరోసాని పెట్టుకుని ముందుకు సాగారు. కానీ, కొందరు జోస్యం చెప్పినట్టుగా గేమ్ ఛేంజర్ గిరవాటు వేసింది. అంత మరీ బేడ్ ఫిల్మ్ కాకపోయినా, దాని మీద జరిగినంత బేడ్ ప్రాపగాండా చలనచిత్ర చరిత్రలోనే మరే సినిమా మీద జరిగి ఉండదు. అదే గేమ్ ఛేంజర్‌కి తట్టుకోలేని ఎదురుదెబ్బగా మారింది.
పక్కనే వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా దిల్‌రాజు స్టేచర్‌ని, ఆయన గౌరవప్రతిపత్తులని వేయిచేతులతో రక్షించింది. సంసారపక్షమైన బడ్జెట్టుతో తీసిన ఈ సంసారపక్షమైన సినిమా దిల్‌రాజు జెండా కిందకి జారకుండా కాపు కాసింది. అటు శంకర్ దర్శకుడిగా తన పాత సక్కెస్లను రిపీట్ చేయలేకపోయాడు. కేవలం కథాకదన వైఖరిని మాత్రమే రిపీట్ చేశాడు. ఇటు, అనిల్ రావిపూడి కొంతవరకూ పోలికలున్న కథే అయినా సరే దిల్‌రాజుతో తనకున్న పాత సక్సెస్ ప్రవాహాన్ని మళ్ళీ సృష్టించగలిగాడు. అదే విజయోత్సవ సభలో ఎప్పుడూ మాట్లాడని శిరీష్ చెబుతుంటే అందరికీ కళ్ళు అంటుకున్నాయి. అంటే గేమ్ ఛేంజర్‌తో ఏర్పడిన అగాధం సంక్రాంతికి వస్తున్నాంతో పూడుకుంది కొంతవరకూ. ఎంత రికవర్ అయిందీ అన్నది పక్కనబెడితే, ముందస్తుగా దిల్‌రాజు సమున్నతస్థాయిని మాత్రం ఏ మాత్రం తగ్గించకపోగా, ఆయన కిరీటాన్ని ఆయనకే ఇచ్చింది. కేవలం నాలుగురోజుల తేడాలో రెండు సినిమాలను విడుదల చేసిన దిల్‌రాజు ధీమా అపార్థమైంది.
ఆయనేదో మూటలు కూడబెట్టేశారు. టేబుల్ ప్రాఫిట్స్ కొట్టేశారు అనే దుగ్ధ ప్రభుత్వాధికారులకి కలగడం సహజమే అయినా సరే, ఆయనకి చేరువుగా ఉన్నవారికి మాత్రం ఈ ఐటి దాడులు బొత్తిగా కొరుకుడుపడలేదు మీడియాలొ కూడా లెక్కాచారం గురించి ఓనమాలు తెలియనివారు మాత్రం వీరవిహారం చేసేశారు ఓ నాలుగురోజుల పాటు. ఇష్టానుసారం వక్రీకరించడంలో తలమునకలైపోయారు. అది పూర్తిగా వారి అపరిపక్వతకీ, అవగాహనా రాహిత్యానికి నిదర్శనంగా మాత్రమే మిగిలింది. ఈ నాటుకోళ్ళ ఊకదంపుడుకి ఊగిపోయిన ఐటి అధికారులు పొలోమని దిగబడిపోయారు. దిల్‌రాజు ఎంత నీట్‌గా ఉంటారో ఆయన క్యాష్ రిజిస్టర్లు కూడా అంతే నీట్ అండ్ క్లీన్‌గా కనిపించేసరికి అధికారులు కూడా అవాక్కయిపోయారు. వారికి కూడా ఇదో గుణపాఠం. ఈ ట్యూబ్ టముకుని నమ్మి రంగంలోకి దిగితే కేవలం వృధాప్రయాస అన్నది వారికే కాదు, సదరు సంబంధింత విభాగాలకి కూడా తెలిసొచ్చింది.
అయితే దిల్‌రాజు మొదటినుంచి మీడియాతో చాలా సఖ్యంగా ఉంటూ, మీడియా కుటుంబ సభ్యుడిగానే ఉంటూ వచ్చిన ఆయన మాత్రం కొంత నొచ్చుకున్న సంగతి నిజం. అందుకే మీడియా ముందుకి వచ్చి మరీ కొంత బాధతోనే మాట్లాడారని చెప్పాలి. అప్పటికీ ఆయన సంస్కారం సన్నగిల్లిపోలేదు. చాలా విచక్షణతో మాట్లాడారు. సంయమనంతో మిత్రవాక్యాలే ఆలపించారు. కొంచెం తెలుసుకుని రాయండన్నది మాత్రమే ఆయన సారాంశం. ఆయన మాటల తాత్పర్యం. కానీ వినరుగా. కాయలున్న చెట్టుకేగా రాళ్ళు. మొండి కాండాల మీద రాళ్ళేస్తే చేతులు నొప్పులే మిగిలేది. అది మీడియాలో ఓ భాగానికి బాగా తెలుసు.
దానాదీనా, దిల్‌రాజే రెండుసార్లు విజేత. గేమ్ ఛేంజర్‌తో దెబ్బ పడిపోయింది ఆయనకి అని చంకలు గుద్దుకునేలోపునే సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసింది. గుండుకొమ్ముల అనుమానాలను తీర్చేసింది. అది మొదటి విజయం. రెండు-ఐటి అధికారులకి ఆసాంతం భంగపాటే మిగిలింది. కృషితో మొనదేలినవారిని తక్కువగా అంచనా వేయకూడదు అనేది ఈ కథలో నీతి.