Allu Arjun stampede case: జనవరి మూడుకి జడ్జిమెంట్ వాయిదా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ఊహించని ఆపదలు ముసురుకొచ్చాయి. అంత పెద్ద హిట్ అయిన సినిమా కథానాయకుడు ఇలా పోలీస్ స్టేషన్ పాలవడం, తర్వాత కోర్టుల చుట్టూ తిరగడం ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి.
తలవని తలంపుగా పుష్ఫ విడుదల సందర్భంగా సంధ్య ధియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ఊహించని ఆపదలు ముసురుకొచ్చాయి. అంత పెద్ద హిట్ అయిన సినిమా కథానాయకుడు ఇలా పోలీస్ స్టేషన్ పాలవడం, తర్వాత కోర్టుల చుట్టూ తిరగడం ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి. నార్త్ అంతా అల్లు అర్జున్‌కి బ్రహ్మరథం పడుతుంటే ఇక్కడ మాత్రం అల్లు అర్జున్‌కి చట్టాలు ఇబ్బందుల ఇరుకనపెడుతున్నాయిని ఆయన అభిమానులు ఎంతో ఆవేదన చెందుతున్నారు.
తరువాతి దశలో అల్లు అర్జున్‌కి ఇంటర్మ్ బెయిల్ అందుకున్నారు. కానీ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయమని అల్లు అర్జున్ పెట్టుకున్న అర్జీ కోర్టులోని వాదోపవాదాలలో చిక్కుకుంది. పోలీసువారు కూడా మళ్ళీ పిటిషన్ వేయడంతో ఈ రోజున ఇరువర్గాల న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు. కానీ రెగ్యులర్ బెయిల్ మంజూరు కాలేదు.. సరికదా…దీనికి సంబంధించిన కేసును జనవరి మూడవ తేదీకి వాయిదా వేసింది కోర్టు. అంటే అల్లు అర్జున్ ఇంకా ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఉపశమనం పొందలేదనేది సారాంశం. జనవరి మూడున కూడా ఏం జరుగుతుందన్నది ప్రస్తుతానికైతే మాత్రం సస్పెన్సే