»Mega Family Is All One Stop Trolls On Allu Arjun Hyper Aadi
Hyper Aadi: మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే.. అల్లు అర్జున్‌పై ట్రోల్స్ ఆపండి
ఏపీ ఫలితాల తరువాత అల్లు అర్జున్ను ఏ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాయి. దానిపై హైపర్ ఆది స్పందించారు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ఒక్కటే అని చెప్పారు.
Mega family is all one.. Stop trolls on Allu Arjun.. Hyper Aadi
Hyper Aadi: గత కొంత కాలంగా అల్లు అర్జున్ను నెటిజన్లు ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తున్నారని.. అది కరెక్ట్ కాదని ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది చెప్పారు. అశ్విన్‌బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటించిన ‘శివం భజే’ ట్రైలర్ రిలీజ్‌కు ఆది హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రస్థావన వచ్చింది. దాంతో హైపర్ ఆది స్పందించారు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నర్.. అందరము చాలా గర్వపడాలి అని అన్నారు. అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అన్నారు. కావాలనే కొందరు ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ను ట్రోల్ చేస్తున్నారు. థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. దయచేసి అది ఆపేయండన్నారు. ఇకనుంచైనా ఇలాంటివి ఆపాలన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అంటే తనకెంతో ఇష్టమని ఆది చెప్పారు. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, అలా ఉంటే దూరంగా నుంచి చూసి ఆనందిస్తానని.. బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకుంటానని వెల్లడించారు. పవన్ కల్యాణ్ కోసమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానన్నాని ఆది చెప్పారు. తను ఎలాంటి పదవులు ఆశించడం లేదని, ఎమ్మెల్సీ ఇస్తారంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు.