Surya starrer 'Kanguva' first single 'Fire Song' release
Kanguva: కోలివుడు స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువ అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ ప్రారంభించారు. అంతే కాకుండా ఈరోజు సూర్య బర్త్‌డే సందర్భంగా ‘కంగువ’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ సాంగ్’ విడుదల చేశారు. ఈ పాటలో యుద్ధ వీరుడిగా సూర్య లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ‘ఫైర్ సాంగ్’ కు పవర్ ఫుల్ ట్యూన్ కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించారు. ‘ఆది జ్వాల..అనంత జ్వాల..వైర జ్వాల.. వీర జ్వాల..దైవ జ్వాల..దావాగ్ని జ్వాల.. ‘ అంటూ ఈ పాట సాగుతుంది.
చదవండి:కంగువలో రోలెక్స్: సూర్య ఫ్యాన్స్ కి పూనకాలే
భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా కంగువ చిత్రాన్ని దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషర్స్ తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోంది. ప్రస్తుతం విడుదలైన సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

