BPT: గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికైన యద్దనపూడి ఎంపీడీవో జావేద్‌ను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం అభినందించారు. ఎంపీడీవో నుంచి డీఎస్పీగా ఎదగడం యువతకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో ప్రజాసేవలో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. జిల్లాలో ఎంపీడీవోగా ఉంటూనే ఈ విజయం సాధించడం విశేషమని కొనియాడారు.

