ఏలూరు జిల్లా ఏజెన్సీలో గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా 86 పనులు మంజూరయ్యాయని కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మంజూరైన 86 పనుల్లో 78 పనులు పూర్తి అయ్యాయని వివరించారు. మిగిలిన పనులు 15 రోజులలో పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాలలోని 86 గ్రామాలకు 81 గ్రామాలలో విద్యుత్ సౌకర్యం అందించామన్నారు.

