CTR: రొంపిచర్ల ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డికి కీలక పదవి లభించింది. ఆయనను వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పదవిని అప్పగించిన జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

