GNTR: జీఎంసీలో దీర్ఘకాలంగా బిల్ కలెక్టర్లుగా పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు కమిషనర్ మయూర్ అశోక్ శనివారం ఉత్తర్వులు జారీ చేయగా.. పదోన్నతి పొందిన వారు ఆయనను కలిసి మొక్కను బహూకరించి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త బాధ్యతల్లోనూ నిబద్ధతతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కమిషనర్ వారికి సూచించారు.

