NLR: విక్రమ సింహపురి యూనివర్సిటీ, హైదరాబాద్కు చెందిన స్కిల్ డిసైర్ సంస్థతో శనివారం ఎంఓయూ కుదుర్చుకుంది. విద్యార్థులు ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంచుకుని ఉపాధి పొందేందుకు ఇది గొప్ప వేదిక అని విసి ఆచార్య అల్లం శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులు, ఇంటర్న్షిప్లు అందించడమే ఈ ఒప్పంద లక్ష్యమని పేర్కొన్నారు.

