WNP: ఆత్మకూరు సమీపంలోని పరమేశ్వర స్వామి చెరువులోకి శనివారం రాత్రి ఓ కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఆత్మకూరుకు చెందిన సంతోష్ తో పాటు మరో వ్యక్తి అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న స్థానికులు వారికి సాయం చేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

