CTR: డ్రోన్ నిఘా కొనసాగుతున్న క్రమంలో, చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని PVKN, గ్రీమ్స్పేటలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి, సంఘటనా స్థలానికి చేరుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు. ప్రజల భద్రత కోసం డ్రోన్ నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

