WGL: నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం సాయంత్రం వరకు నామినేషన్ల పరిశీలన పూర్తయినట్లు మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 291 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించినట్లు వెల్లడించారు. సమర్పించిన నామినేషన్లలో ఒకటి కూడా తిరస్కరణ కాలేదని పేర్కొన్నారు.

