నాగర్ కర్నూల్ మున్సిపల్ రెండో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పి.శ్రీనివాసుల నామినేషన్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి పాండు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. శ్రీనివాసులు ప్రభుత్వ వాటా ఉన్న సింగిల్ విండోలో సీఈఓగా విధులు నిర్వహిస్తున్నారని, ఈ వివరాలను దాచీ అసంపూర్ణ పత్రాలు సమర్పించారని పేర్కొన్నారు. ఈ పరిణామంతో రెండో వార్డులో ఉత్కంఠ నెలకొంది.

