»Harish Shankar 56 Year Old Ravi Tejas Romance With An Older Heroine Harish Shankar Gave Up
Harish Shankar: పాతికేళ్ల హీరోయిన్‌తో 56 ఏళ్ల రవితేజ రొమాన్స్.. హరీష్ శంకర్ ఇచ్చి పడేశాడు
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ దర్శకత్వంలో 'మిస్టర్ బచ్చన్' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా అదిరిపోయింది. అయితే.. కొందరు మాత్రం మరో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో హరీష్ శంకర్ ఇచ్చి పడేస్తున్నాడు.
Harish Shankar: 56-year-old Ravi Teja's romance with an older heroine.. Harish Shankar gave up
Harish Shankar: ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మిరపకాయ్ తర్వాత రవితేజ, హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. మిస్టర్ బచ్చన్ పై అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ జరుపుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది మిస్టర్ బచ్చన్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. సితార్.. అంటూ సాగే సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో రవితేజ, భాగ్యశ్రీ అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. ముఖ్యంగా భాగ్యశ్రీ అందానికి ఫిదా అవుతున్నారు కుర్రాళ్లు. అమ్మడి అందం సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే.. మిస్టర్ బచ్చన్ రిలీజ్‌కు ముందే అమ్మడికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ పాట చూసిన తర్వాత ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు హరీష్ శంకర్.
56 ఏళ్ల రవితేజతో పాతకేళ్ల హీరోయిన్ భాగ్యశ్రీతో అలాంటి స్టెప్స్ వేయింటడమేంటి.. హీరోయిన్ మొహం కూడా చూపించకుండా ఇలా చేయడం కేవలం టాలీవుడ్‌కే సాధ్యమంటూ.. ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన హరీష్.. ‘కంగ్రాట్స్.. చాలా బాగా కనిపెట్టావ్.. నోబెల్ ప్రెజ్‌కు దరఖాస్తు చేసుకో..’ అంటూ రిప్లై ఇచ్చాడు. అలాగే.. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ఫిల్మ్ మేకర్స్‌ను ప్రశ్నిస్తూ ఉండాలి.. నీలాంటి వారికి ఎప్పుడు వెల్కమ్ చెబూతూనే ఉంటా’ అని రాసుకొచ్చాడు హరీష్. ఇదంతా పక్కన పెడితే.. మిక్కి జే మేయర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మాత్రం అదిరిపోయిందని అంటున్నారు.