KMM: కార్మికుల రక్తాన్ని జలగల్లా పీడించే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పటేల్ అన్నారు. ఆదివారం ఖమ్మం CPIML న్యూడెమోక్రసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ లేబర్ కోడ్లు నేడు దేశ కార్మికవర్గానికి గొడ్డలిపెట్టుగా మారి భవిష్యత్తును చీకటి చేస్తుందన్నారు.

