E.G: రాజమండ్రి, కొవ్వూరు డివిజన్లో నిత్యావసర వస్తువుల చట్టం 1955 క్రింద 6-A కేసులలో స్వాధీనపరచుకున్న 3,335.83 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యానికి ఈనెల 12న బహిరంగ వేలం జరగనుంది. ఈ విషయాని జిల్లా పౌర సరఫరాల అధికారి వి. పార్వతి ఆదివారం ప్రకటన ద్వారా తెలియాజేశారు. స్థానిక పౌర సరఫరాల కార్యాలయం వద్ద జరగనున్న ఈ వేలంలో ఆసక్తి గలవారు పాల్గొనాలన్నారు.

