VZM: మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుని అసభ్యకరంగా దూషించిన కారణంగా వారిపై 1టౌన్ పోలీస్ స్టేషన్లో పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అంబటిని ఏమని అనాలో తెలియడం లేదని, జంతువులతో పోలిచినా వాటికీ అవమానకరం అని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన అంబటిపై చర్యలు తీసుకోవాలన్నారు.

