MDK: బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేయడంతో అల్లాదుర్గం మండలంలోని BRS నాయకులు ఇవాళ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై కక్ష సాధింపులు మానుకోవాలని మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

