KNR: సైదాపూర్ మండలానికి సాగునీరు వచ్చే మిడ్ మానేర్ కుడి కాలువ మరమ్మతులకు ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు ఎఎంసీ ఛైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్ ఆదివారం తెలిపారు. కాలువ మరమ్మతులకు రేపు టెండర్ వేస్తారని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లోనే మరమ్మతులు చేసి పంట పొలాలకు సాగునీరు అందించేందుకు మంత్రి పొన్నం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

