MNCL: హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో బెల్లంపల్లికి చెందిన సదానందం ప్రతిభ చాటారు. మాస్టర్స్ విభాగంలో ఆయన ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుని రజత పతకాన్ని సాధించారు. ఈ విజయంతో సదానందం జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు వెల్లడించారు. పట్టణ క్రీడాకారుడు రాష్ట్ర స్థాయిలో రాణించడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

