ATP: జిల్లాలో రోడ్డు భద్రతను బలోపేతం చేసేందుకు ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ నిబంధన నేటి నుంచి అమల్లోకి వచ్చింది. అనంతపురం త్రీటౌన్ పరిధిలోని ఎంజీ పెట్రోల్ బంక్ వద్ద హెల్మెట్ ధరించిన వాహనదారులను పోలీసులు, బంక్ యజమానులు ప్రత్యేకంగా సత్కరించారు. నిబంధన పాటించిన వారికి వెండి నాణేలు, రోజా పూలు అందజేసి శాలువాలతో గౌరవించారు.

