NLG: రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పుడు కేసులు బనాయించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలకు నిరసనగా ఆదివారం దేవరకొండ బస్ స్టేషన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.

