TG: మాజీ మావోయిస్టు బర్సే దేవా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘పోలీసులకు నా అంతట నేను లొంగిపోలేదు. బయటికెళ్తున్న సమయంలో పోలీసులకు చిక్కడంతోనే లొంగిపోవాల్సి వచ్చింది. పార్టీలో దేవ్ జీ, గణపతి ఎక్కడ ఉన్నారో తెలియదు. గతేడాది అక్టోబర్లో హిడ్మాతో కలిసే ఉన్నా. చాలా కాలం కలిసి పని చేశాను. మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోతోంది. మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి’ అని తెలిపాడు.