రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ జనవరి 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆషికా రంగనాథ్ సందడి చేసింది. ట్రైలర్ లాంచ్‌కి వస్తేనే.. సినిమా చూస్తున్నట్టు ఉందని తెలిపింది. ఫ్యామిలీస్‌తో కలిసి సినిమా చూడాలని కోరింది.