SRCL: ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న మట్టి టిప్పర్ పట్టుకొని చందుర్తి పోలీస్ స్టేషన్కి తరలించినట్లు ఎస్సై జే.రమేష్ శుక్రవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. బ్లూకొల్ట్ సిబ్బంది విధులలో భాగంగా జోగాపూర్ వెళ్ళగా గ్రామంలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఏపీ 29 యు 9839 గల టిప్పర్ని సీజ్ చేశామన్నారు.