ప్రకాశం జిల్లాలో రైతులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలన్నీ 11వ తేదీలోగా పంపిణీ చేయాలని కలెక్టర్ రాజాబాబు శుక్రవారం ఆదేశించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ పరమైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, అర్జీల స్థితిగతులను ప్రజలకు తెలియజేయాలన్నారు. జిల్లాలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.