కోనసీమ: దేశంలో, ప్రపంచంలో ఎక్కడ స్థిరపడి ఉన్నా కుటుంబ సభ్యులు అందరూ ఒక చోట చేరి జరుపుకునే పండుగ సంక్రాంతి అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మహాత్మా గాంధీ జూనియర్ కళాశాలలో శనివారం జరిగిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆత్రేయపురం వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.