ఉత్కటాసనం చేయడం వల్ల తొడలు, పిరుదులు, కాళ్లు, వెన్నెముక, భుజాలు, చేతులు వంటి భాగాలను బలపరుస్తుంది. పొట్టలోని అవయవాలను ఉత్తేజపరిచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఛాతీ, డయాఫ్రమ్ను తెరుస్తుంది. శ్వాసక్రియను, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి శక్తినిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.