ADB: ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనదారులకు ఆదిలాబాద్ పట్టణంలో నిన్న వినూత్న రీతిలో అభినందనలు తెలియజేశారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులు, సీట్ బెల్ట్ పెట్టుకున్న కార్ల డ్రైవర్లను గుర్తించి విద్యార్థుల చేతుల మీదుగా వారికి పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, ఏఎంవీఐలు హరేంద్ర కుమార్, రంజిత్ కుమార్ తదితరులు ఉన్నారు.