NGKL: సంక్రాంతి పండుగ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సొంత గ్రామాలకు వెళ్తున్న ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు. ఇంట్లో విలువైన వస్తువులను వదిలి వెళ్లవద్దని, నగలు, నగదు, ముఖ్యమైన పత్రాలను బ్యాంకు లాకర్లో భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.