SKLM: ఇచ్చాపురం మండలం కేశపురంలో త్యాగరాజు స్వామి ఆరాధన మహోత్సవాలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బి.అశోక్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగీతం త్యాగరాజు పుట్టినిల్లు అని అన్నారు. త్యాగరాజు కీర్తనలు నేటికీ మనం ఆలపిస్తున్నామని గుర్తు చేశారు. అటువంటి మహానీయులు భారతదేశానికి గర్వకారణమన్నారు.