BDK: అశ్వారావుపేట గుర్రాలచెరువు గ్రామపంచాయతీలతో కలిపి నూతన మున్సిపాలిటీగా నియోజకవర్గ కేంద్రం అవతరించింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇవాళ పిలుపునిచ్చారు. సత్యసాయి కళ్యాణ మండపంలో నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు.