కరీంనగర్ జిల్లా బాస్కెట్ బాల్ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న హాసిని, అక్షయా, సిద్ధార్థ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఛత్తీస్గఢ్లో ఈ నెల 11 నుంచి 16 వరకు జరిగే 69వ ఎసీఎఫ్ (U-17) పోటీల్లో వీరు పాల్గొంటారు. క్రీడాకారుల ఎంపికపై డీవైఎస్ఓ శ్రీనివాస్, కోచ్ అరుణ్ తేజ్ హర్షం వ్యక్తం చేశారు.