మంచిర్యాల: జిల్లాలో సెలవులు, వివాహాల కోసం ఇళ్లకు తాళం వేసి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని CP అంబర్ కిషోర్ ఝా ఇవాళ సూచించారు. చోరీల నివారణకు స్వీయ రక్షణ చర్యలు పాటించాలన్నారు. ముఖ్యంగా ఇళ్ల వద్ద అమర్చిన సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా, లేదా, నైట్ విజన్ స్పష్టంగా ఉందా? అనే విషయాలను సరిచూసుకోవాలని తెలిపారు. నేరాల నియంత్రణలో సాంకేతికత కీలకమన్నారు.