E.G: గోపాలపురంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం నిర్వహించనున్న క్రికెట్ మ్యాచ్లో 11 మంది ఎమ్మెల్యేలు పాల్గొంటారని MLA వెంకటరాజు తెలిపారు. ప్రజల్లో ఉత్సాహం నింపడంతో పాటు పండుగ వాతావరణాన్ని మరింత ఉల్లాసంగా మార్చడానికే ఈ క్రికెట్ మ్యాచ్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడా పోటీని వీక్షించేందుకు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై, క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు.