MBNR: టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్గా ఇటీవల నియమితులైన డాక్టర్ తవ్వంపల్లి సత్యనారాయణను శుక్రవారం బాలానగర్ మండలానికి చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ.. తనకు అధిష్టానం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎస్సీల అభ్యున్నతికి, వారి హక్కుల సాధన కోసం విశేషంగా కృషి చేస్తానని తెలిపారు.