BHNG: ఎస్ఎఫ్ఐ ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణ కేంద్రంలోని గర్ల్స్ హైస్కూల్, బాయ్స్ హైస్కూల్, ప్రైమరీ స్కూల్లలో శుక్రవారం విద్యార్థినిలకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆలేరు మండల కార్యదర్శి కాసుల నరేష్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.