NZB: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటీవల మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే NZB పేరును ఇందూరుగా మారుస్తామన్నారు. దీనిపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పందించారు. ఎంపీ అర్వింద్ మాటలకు బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు శనివారం తెలిపారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్ నగరం పేరును ఇందూరుగా మారుస్తామన్నారు.