KNR: సైదాపూర్ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా, సైదాపూర్ మండల కేంద్రంలో అవగాహన నిర్వహించారు. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల ఆధ్వర్యంలో వినూత్నంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ముగ్గుల రూపంలో రహదారి నిబంధనలను ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ రూరల్ సీఐ హాజరై ప్రసంగించారు.