W.G: నరసాపురం రోడ్డులో శుక్రవారం దారుణ ఘటన జరిగింది. థామస్ బ్రిడ్జి సమీపంలో వృద్ధురాలు నడిచి వెళ్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు రైల్వేస్టేషన్ దారి అడిగారు. ఆమె వివరిస్తుండగా మెడలోని బంగారు ఆభరణాలు లాక్కొనే ప్రయత్నం చేశారు. బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో గొలుసు తెగి కొంతభాగం వారి చేతికి చిక్కింది. దుండగులు పరారవ్వగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.