W.G: మాదక ద్రవ్యాల వినియోగం ప్రాణాంతకమని భీమవరం మెజిస్ట్రేట్ ఎన్. జ్యోతి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం నందమూరుగరువు సచివాలయం వద్ద న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సరదాగా మొదలయ్యే వ్యసనం జీవితాలను ఛిద్రం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వాడినా, విక్రయించినా చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.