SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు గుడి చెరువు మైదానంలో కొత్తగా కంటైనర్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన మహాశివరాత్రి సమావేశంలో ఇంఛార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు చేపట్టారు.